![]() |
![]() |
.webp)
కాకమ్మ కథలు షో ఈ మధ్య కాలాల్లో ఆహా ప్లాట్ఫార్మ్ మీద మంచి రేటింగ్ ని సంపాదించుకుంటోంది. ప్రతీ వారం ఈ షోకి సెలబ్రిటీస్ రావడం వాళ్ళను తేజస్విని మడివాడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. ఇక ఈ వారం ముమైత్ ఖాన్, శేఖర్ మాష్టర్ వచ్చారు.
ఇందులో ముమైత్ ఖాన్ జాతకం చెప్పింది కాకమ్మ. ఒక పెద్ద సింహాసనం ఐతే చూపించింది తేజు. అందులో కూర్చోబోతోంది క్వీన్ ముమైత్ అని చెప్పింది. "ఐతే ఈ క్వీన్ మన తెలుగు ఇండస్ట్రీని చాల సంవత్సరాలు రూల్ చేసింది. ఈసారి రూల్ చెయ్యట్లేదు తానె కూర్చుని క్వీన్ కాబోతోంది." అని చెప్పింది తేజు. "సరే తేజు ఒకటి చెప్పు నేను ప్రెసిడెంట్ ఐతే ఎలా ఉంటుంది" అని అడిగింది ముమైత్. "అసలు ముమైత్ ఖాన్ ప్రెసిడెంట్ ఐతే జనాభా ఎలా ఉంటుందో చూపించినా అంటూ తేజు ఇప్పటికింకా నా వయసు అంటూ డాన్స్ లు వేస్తారు అంటూ డాన్స్ చేసి చూపించింది. స్కూల్స్ లో డాన్స్ క్లాసెస్ కంపల్సరి చేస్తుంది. ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డ్యాన్సింగ్ యు విల్ బి" అని తేజు అనేసరికి "డాన్స్" అంది ముమైత్. డాక్టర్ తనని ని ఏడేళ్ల పాటు ఏ పని చేయకూడదు అని చెప్పారని ఎందుకంటే యాక్సిడెంట్ కారణంగా ఆమె తలలో వైర్ లు అమర్చడం వలన ఇబ్బంది పడతారని చెప్పడంతో ఇండస్ట్రీలో కనిపించకుండా రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది. ప్రభాస్ ఫేవరేట్ హీరో అని పూరి జగన్నాధ్ ఫేవరేట్ డైరెక్టర్ అని చెప్పింది. తన గ్రేస్ ని రీప్లేస్ చేస్తున్న డాన్సర్స్ లో సాయి పల్లవి, శ్రీలీల ఉన్నారని చెప్పింది ముమైత్. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మోహన్ బాబు, నాగార్జునతో నటించాలని ఉందట. డాన్స్ రియాలిటీ షోస్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పింది.
![]() |
![]() |